Saturday, April 20, 2024

బీహెచ్‌ఎంఎ స్‌ యాజమాన్య కోటా సీట్లకు మార్చి 2వ తేది వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రైవేట్‌ హోమియోపతి కళాశాలలోని యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నీట్‌-2022 అర్హత సాధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకోని అభ్యర్థులు మార్చి 2వతేది శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఈ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్‌ జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

- Advertisement -

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సీట్ల కేటాయింపునకు మార్చి 4వ తేది ఆదివారంసాయంత్రం 4 గంటల వరకు ఆసక్తి ఉన్న కళాశాలలోని ప్రిన్సిపాల్‌ను నేరుగా సంప్రదించాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ WWW.KNRUHS.TELANGANA.GOV.IN ను చూడవల్సిందిగా యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement