Thursday, October 3, 2024

Buffer stock | మార్కెట్లోకి ఉల్లి బఫర్‌ స్టాక్‌ విడుదల…

ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న బఫర్‌స్టాక్‌ను హోల్‌సేల్‌ మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. ఎగుమతులపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో, ఇటీవల ఉల్లి ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ.100కు చేరువవుతోంది.

దీంతో కేంద్ర ప్రభుత్వం ధరలకు కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రధాన నగరాల్లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లోకి బఫర్‌ స్టాక్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.

ఈ మేరకు కేంద్ర వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రిటైల్‌గా విక్రయించే ఆలోచన కూడా చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 4.7 లక్షల టన్నుల బఫర్‌ స్టాక్‌ను విడుదల చేయాలని నిర్మయించాం.

తద్వారా ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లిdలో కిలో రూ.55, ముంబైలో రూ. 58, చెన్నైలో రూ.60, హైదరాబాద్‌లో రూ 60 చొప్పున ధరలు పలుకుతున్నాయి. ఇతర ప్రధాన నగరాల్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది.

ఉల్లిపై ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా ఢిల్లిd సహా ఇతర రాష్ట్ర రాజధానుల్లో రూ.35 చొప్పున మొబైల్‌ వ్యాన్ల ద్వారా ఉల్లి విక్రయాలు చేపట్టారు. జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధమైన రాయితీ విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement