టీడీపీ నేత, ఒంగోలు లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. ఒంగోలు మాజీ ఎంపీ, దివంగత ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందారు.. దీంతో ఎంపీ మాగుంట ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. కాగా, మాగుంట పార్వతమ్మ కావలి శాసనభ్యురాలిగా కూడా పనిచేశారు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన నేతగా.. అందరని ఆదుకునే మనిషిగా గుర్తింపు పొందారు.
అయితే, ఇటీవలే మాగుంట సుబ్బారామిరెడ్డి కుమారుడు కన్నుమూశాడు.. ఇప్పుడు మాగుంట పార్వతమ్మ చనిపోవడంతో.. ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించి.. విషాదం నెలకొంది.
కాగా, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించారు పార్వతమ్మ.. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది. ఇక, 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో పార్వతమ్మ వివాహం జరిగింది.. 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు..
మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. అయితే, 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయారు..