Thursday, April 18, 2024

విశాఖ దుర్ఘటనకు నేటితో ఏడాది

అందమైన నగరం విశాఖ చరిత్రలో నేడు చీకటి రోజు. ఎల్జీ పాలిమర్స్ ఇండస్ట్రీ నుంచి ప్రమాదకర స్టైరిన్ గ్యాస్ లీకై 15 మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ దుర్ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయింది. విషవాయువు ధాటికి ఊపిరి అందక ప్రజలు రోడ్లపైనే కుప్పకూలిపోయారు. చూస్తుండగానే ప్రాణాలు వదిలారు. భారీ చెట్లు సైతం మాడిపోయాయి. కోలుకున్న వారికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కొందరికి పరిహారం ఇప్పటికీ అందలేదు.

ప్రమాదానికి గురైన ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామమే కాక చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు నేటికి ఆరోగ్య సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రజల ఆరోగ్యాలను అనునిత్యం చూసేలాగ ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామంటూ ఆనాటి ప్రజా ఉద్యమం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ కూడా గాలిలో కలిసిపోయింది. శరీరాలపై ఏర్పడిన మచ్చలు, దద్దుర్లు పోవడం లేదంటూ ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామస్తులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement