Wednesday, April 24, 2024

ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి 22, 23వ తేదిల్లో వన్‌టైం వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎండీ హోమియో వైద్యసీట్ల భర్తీకి వెబ్‌ ఆప్షన్లకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదలచేసింది. పీజీ హోమియో కోర్సుల్లో యాజ మాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీచేయనున్నారు. అభ్యర్దుల నమోదు చేసిన ఇట్టి వన్‌టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడదల కౌన్సెలింగ్‌లకు సీట్లు కేటాయింపులు జరపనున్నారు.

అర్హులైన అభ్యర్ధుల ఆన్‌లైన్‌లో ఈనెల 22వ తేదిన ఉదయం 9 గంటల నుంచి 23వ తేది సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోచ్చు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement