Saturday, April 20, 2024

మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ – మావోయిస్టు మృతి

.

చింతూరు.. చత్తీస్గడ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న గచ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు ఈ ఘటనలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు గచ్చిరోలి జిల్లా మౌజ తోడగట్ట వద్ద నక్సలైట్లు భారీ ఎత్తున మెరుపు దాడి ప్లాన్ చేసుకున్నారని విశ్వాసనీయ సమాచారం మేరకు ప్రత్యేక జవాన్లు, గచ్చిరాలి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఉదయం 10 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతంలోని కొండపై 60 నుండి 70 మంది మావోయిస్టులు పోలీసులకు తారస పడ్డారు. బిజియల్ ఇతర ఆయుధాలతో పోలీసులపై కాల్పులు జరిపారు . పోలీసులు కూడా ఎదురు కాల్పులు దీటుగా 30 నుండి 45 నిమిషాలు హోరాహోరీగా కాల్పులు జరిపారు. కాల్పులు జరుపుకుంటూ అడవిలోకి పరారయ్యారు. అనంతరం ఘటనా స్థలంలో పరిశీలించి చూడగా ఒక మావోయిస్టు మృతదేహం లభ్యమైనది. మృతి చెందిన మావోయిస్టు ను సమీర్ అలియాస్ సాధులింగ మోహన్ దా (31) గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై నాలుగు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.2018 లో పోస్తే బొమ్ రా పోలీసులపై మెరుపు దాడి చేసి నందుకు కేసు నమోదయిందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో పోలీసులు ఒక కంట్రీ మేడ్ రైఫిల్, బర్మా ర్ రైఫిల్, ఒక 303 రైఫిల్, పేలుడు పదార్థాలు, రెండు మ్యాగజైన్లు,30 యస్ యల్ అర్ రౌండ్లు,8 యం యం రౌండ్లు 3 రౌండ్ల రైఫిల్, 12బోర్ 4 రౌండ్లు, సాంసంగ్ కంపెనీ ట్యాబులు, రేడియో, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement