Wednesday, May 19, 2021

తిరుమలలో అగ్ని ప్రమాదం… ఒకరి సజీవ దహనం

తిరుమల కొండపై గల ఆస్థానమండపంలోని దుకాణాలలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. 84వ నెంబర్ దుకాణంలో ఓ యువకుడి శవాన్ని పోలీసులు గుర్తించారు. బాడీ పూర్తిగా కాలిపోవడంతో దుకాణాదారులు గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆరు దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News