Friday, April 19, 2024

ఒక్కొక్కటిగా బయటపడుతున్న చికోటి చీకటి కోణాలు…

మెదక్‌ : చికోటి చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ చికోటి ప్రవీణ్‌కు పలువురు నేతలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న మెదక్‌ జిల్లా ఏడుపాయలలో చికోటి ప్రవీణ్‌ బర్త్‌ డే వేడుకలు స్థానిక హరిత హోటల్లో ఘనంగా నిర్వహించారు. బర్త్‌ డే పార్టీకి 150 మంది ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. చక్రపాణి పేరుతో హరిత హోటల్‌లో 6 గదులు, 2 హాల్స్‌ బుక్‌ అయ్యాయి. చికోటికి మెదక్‌ జిల్లా ప్రముఖులు గోవాలో పరిచయమయ్యారు. చికోటి లిస్టులో ఎక్కువగా ఉమ్మడి మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి పేరు వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement