Thursday, March 28, 2024

మాన్ స్టర్ మూవీపై – నిషేధం విధించిన గల్ఫ్ దేశాలు

ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది మాన్ స్టర్ చిత్రం. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. కాగా ఈ సినిమాకు గల్ఫ్‌ దేశాలు షాక్‌ ఇచ్చాయి. గల్ఫ్ దేశాలు మాన్ స్టర్ ప్రదర్శనపై నిషేధం విధించాయి. ఈ సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీ టీ క్యూ) కంటెంట్ ఉండడంతో నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్ కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement