Wednesday, April 24, 2024

ఫిబ్ర‌వ‌రి 10నుండి అమెజాన్ ప్రైమ్ లో.. హంట్

అప్పుడే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది హంట్ మూవీ.ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో రెండు వారాల ముందుగానే మరో డీల్‌తో రెండు వారాల ముందు అంటే ఫిబ్రవరి 10నుండి ఈ సినిమాను స్రీమింగ్‌ చేయనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మహేష్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం హంట్. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఎప్పుడో పదేళ్ల క్రీతం మలయాళంలో వచ్చిన ‘ముంబై పోలీస్‌’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ముందు నుండి ఈ సినిమాను రీమేక్ అన్నట్లు ప్రచారం చేయలేదు. కానీ ముంబై పోలీస్‌ చూసిన ప్రతీ ఒక్కరికి హంట్‌ రీమేక్‌ సినిమానే అని ఇట్టే తెలిసిపోతుంది. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు న‌టించారు.కాగా ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ సినిమా స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసింది. కాగా ముందుగా మేకర్స్ ఈ సినిమాను నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్‌ చేయాలని ప్రైమ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement