Thursday, April 25, 2024

విజయనగరంలో ఒమిక్రాన్ కలకలం.. ఐర్లండ్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్..

విజయనగరం, ప్రభన్యూస్ : విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ కేసు నమోదైనట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఐర్లాండ్‌ నుంచి ఈనెల 5న విజయనగరం జిల్లా వీరనారాయణపురం గ్రామానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధాన అయిన‌ట్లు ఆ ప్రక‌టన‌లో తెలిపారు. వాస్తవానికి ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లాకు వచ్చిన వ్యక్తి గురించి ముంబై ఎయిర్‌పోర్టు అధికారులు విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చిన వెంటనే అవసరమైన వైద్య పరీక్షలు చేశారు వైద్యులు. కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించబడింది తప్ప ఒమిక్రాన్‌ నిర్ధారించబడలేదని వైద్య, ఆరోగ్య శాఖ అప్పట్లో చెప్పింది. అయితే, ఒమిక్రాన్‌ నిర్ధారణకు సంబంధించి శాంపిల్స్‌ హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించినట్లు మాత్రం ప్రకటన రూపంలో వెల్లడించింది.

ఆ వ్యక్తిని హోమ్‌ ఐసోలేషన్‌లో వుంచినట్లు తెలిపింది. సదరు ఫలితం వెల్లడై ఒమిక్రాన్‌ నిర్ధారించబడినట్లు తాజాగా ప్రకటించింది. అయితే, ఐర్లాండ్‌ నుంచి ఆ వ్యక్తి జిల్లాలోకి అడుగు పెట్టినప్పటికే ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్‌ మీడియాలో కూడా అదే విషయం హల్‌చల్‌ చేసింది. కాగా, కొద్ది రోజుల కిందట ఐర్లాండ్‌ నుంచి ముంబై ఎయిర్‌పోర్టులో దిగి కోవిడ్‌ పరీక్షలు కూడా చేయించుకోకుండా తిరుపతి వెళ్లిన ఆ వ్యక్తి అక్కడి నుంచి నేరుగా వీరనారాయణపురం లోని తన అత్తవారింటికి రావడంతో అవసరమనుకున్న కొంత మంది కుటుంబ సభ్యులకు కోవిడ్‌ టెస్టులు నిర్వహించగా అందరికీ నెగటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement