Friday, March 15, 2024

కూలిపోయిన పురాతన వంతెన.. ఇరుక్కుపోయిన లారీ

వందేళ్ల నాటి పురాతన వంతెన కూలి లారీ ఇరుక్కుపోయిన ఘటన గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరక్కపోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అవనిగడ్డకు బ్లీచింగ్ పౌడర్ లోడుతో లారీ వెళ్తున్న సమయంలో ముందు భాగం వంతెన దాటింది. ఈలోగా వంతెన కూలిపోయింది. లారీలో అధిక లోడు ఉండటం వల్ల వంతెన సామర్థ్యం సరిపోలేదు. బ్రిటీష్ హయాంలో నిర్మించిన వంతెనకు ఇటీవలే మరమ్మతులు చేశారు. అవనిగడ్డకు వెళ్ళేందుకు వెల్లటూరు మీదుగా వేరే రోడ్డు ఉన్నప్పటికీ దగ్గరి దారి కావడంతో లారీడ్రైవర్ వంతెన మీదుగా వెళ్లాడు. బరువు ఎక్కువ కావటంతో వంతెన కూలిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement