Friday, March 29, 2024

ఓలా స్కూటర్‌ రూ.85వేలు..

విద్యుత్‌ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ తన స్కూటర్ల శ్రేణిలో మార్పులు చేసింది. ఎస్‌1 స్కూటర్ల శ్రేణిలో కొత్తగా 2కె డబ్ల్యుహెచ్‌ బ్యాటరీ ఆప్షన్‌తో స్కూటర్లను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎస్‌1, ఎస్‌1 ప్రొ వేరియంట్లకు అదనంగా ఎస్‌1 ఎయిర్‌లో మూడు వేరియంట్లు, ఎస్‌1లో ఒకవేరియంట్‌ తీసుకొచ్చింది. దీంతో ఇప్పటికే ఉన్న ఎస్‌1, ఎస్‌1 ప్రొతో కలిపి మొత్తం ఆరు స్కూటర్లు అందుబాటులో ఉండనున్నాయి. 2కె డబ్ల్యుహెచ్‌ బ్యాటరీ కలిగిన ఎస్‌1 ఎయిర్‌ ధరను రూ.84,999గా నిర్ణయించింది.

అదే గనుక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఎస్‌1 స్కూటర్‌ ధరను రూ.99,999గా నిర్ణయించింది. ఎస్‌1 స్కూటర్‌ విషయానికొస్తే, కొత్తగా 2కె డబ్ల్యుహెచ్‌ సామర్థ్యంతో తీసుకొచ్చిన ఓలా ఎస్‌1 సింగిల్‌ చార్జ్‌తో 91 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ఇప్పటికే అందుబాటులో ఉన్న 3కె డబ్ల్యుహెచ్‌ ఎస్‌1 స్కూటర్‌ సింగిల్‌ చార్జ్‌తో 141 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. దీనిగరిష్ట వేగం 95 కి.మీ. ఎస్‌1 ప్రొ 4కె డబ్ల్యుహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం 185 కి.మీ. గంటకు గరిష్టంగా 116కి.మీ.స్పీడ్‌తో దూసుకెళ్తుంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వాహన శ్రేణిని సవరించినట్లు ఓలా సంస్థ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement