Saturday, April 20, 2024

భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఆయిల్‌ పైపులైన్‌.. ఈ నెల 18న ప్రారంభించనున్న మోడీ,షేక్‌ హసీనా

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య మొదటి క్రాస్‌ బోర్డర్‌ ఆయిల్‌ పైపులైన్‌ ప్రారంభం కానుంది. ఈ నెల 18న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసినా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ మంత్రి ఏకే మోమిన్‌ శుక్రవారం నాడు తెలిపారు. పలు దఫాలుగా జరిగి దైపాక్షిక చర్చల తరువాత 130 కి.మీ. ఇండో-బంగ్లా ఫ్రెండ్‌షిప్‌ పైపులైన్‌ (ఐబీఎఫ్‌పీఎల్‌) కార్యరూపం దాల్చనుందని ఆయన తెలిపారు. ఈ పైపులైన్‌ ద్వారా బంగ్లాదేశ్‌ తన ఇంధన అవసరాలను చాలా వరకు తీర్చుకోవడానికి వీలుకలుగుతుందన్నారు. అస్సాంలోని నుమాలిగర్‌ రిఫైనరీ లిమిడెట్‌(ఎన్‌ఆర్‌ఎల్‌) నుంచి నేరుగా ఈ పైపులైన్‌ ద్వారా బంగ్లాదేశ్‌కు డీజిల్‌ను పంపించనున్నారు.

ఈ పైపులైన్‌ పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఎన్‌ఆర్‌ఎల్‌ మార్కెటింగ్‌ టెర్మినల్‌ ద్వారా బంగ్లాదేశలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో ఉన్న పర్బతిపూర్‌ నగరంలో ప్రభుత్వ చమురు సంస్థ బంగ్లాదేశ్‌ పెట్రోలియంం కార్పోరేషన్‌ (బీపీసీ) చమురు డిపోకు ఇంధనాన్ని సరఫరా చేస్తుంది. సిలిగిరిలో శివారులో ఇంధనం బదిలీ పాయింట్‌ ఉంటుంది. బంగ్లాదేశ్‌లో బీపీసీ పూర్తి మార్కెటింగ్‌ హక్కులు కలిగి ఉంటుంది.

- Advertisement -

పైపులైన్‌ నిర్మాణ పనులను 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. దీని నిర్మాణ పనులను రెండు దేశాల ప్రధాన మంత్రుల కార్యాలయాలు నేరుగా పర్యవేక్షించాయి. ఈ భారత్‌-బం గ్లాదేశ్‌ ఫ్రెండ్‌షిప్‌ పైపులైన్‌ నిర్మాణానికి 377.08 కోట్లు ఖర్చయింది. ఇందులో మన దేశం 285.24 కోట్లకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద సమకూర్చింది. 91.84 కోట్ల రూపాయలను ఎన్‌ఆర్‌ఎల్‌ సమకూర్చింది. 130 కి.మీ ఈ పైపులై న్‌ మన దేశ భూభాగంలో కేవలం 5 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. మిగిలినదంతా బంగ్లాదేశ్‌లోనే నిర్మించారు.

ఈ పైపులైన్‌ ద్వారా సంవత్సరానికి ఒక మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల చమురును బంగ్లాదేశ్‌కు సరఫరా చేయవచ్చు. బంగ్లాదేశ్‌ ప్రతి ఏటా సుమారు 2.64 బిలియన్‌ డాలర్ల విలువపై ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది.
పైపులైన్‌ తరువాత రెండు దేశాలకు చెందిన పలు ప్రాజెక్ట్‌లు పూర్తి కావాల్సి ఉంది. మన దేశంలోని అగర్తా నుంచి బంగ్లాదేశ్‌లోని అఖురా వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్‌ ప్రధానమైనది. ఈ రైల్వే లైన్‌ను మన దేశం నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement