Friday, April 19, 2024

న‌వీన్ ప‌ట్నాయ‌క్ కొత్త క్యాబినెట్ – 21మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం

భువ‌నేశ్వ‌ర్ లోక్ సేవా భ‌వ‌న్ లోని క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో 21మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కొత్త క్యాబినెట్ లో మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాయక్ టీమ్‌‌లో ఈ సారి ఒకరి సంఖ్య పెరిగింది. గత క్యాబినెట్‌లో 20 మంది మంత్రులు ఉండేవారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కోసం వారంతా రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో 13 మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్తులు ఇచ్చినట్టు స‌మాచారం. కాగా, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్వతంత్ర హోదా కింద మంత్రిత్వ శాఖలు ఇచ్చార‌ట‌. ట్రైబల్ లీడర్‌గా పేరున్న జగన్నాథ్ సరాకా క్యాబినెట్ మంత్రిగా తొలి ప్రమాణం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సరాకా క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఐదు సార్లు ఎమ్మెల్యే, సీనియర్ బీజేడీ నేత నిరంజన్ పుజారీ క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం తీసుకున్నారు.

పుజారీతోపాటు అతాగడ్ ఎమ్మెల్యే రానేంద్ర ప్రతాప స్వెయిన్, మాజీ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, చికిటి ఎమ్మెల్యే ఉషా దేవి, ఔల్ ఎమ్మెల్యే ప్రతాప్ దేబ్‌లతోపాటు ప్రఫుల్లా మల్లిక్, మహాకల్పద ఎమ్మెల్యే అతాను సబ్యసాచి నాయక్‌లు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అతాను సబ్యసాచి నాయక్ ఎనిమిదేళ్ల విరామం తర్వాత తిరిగి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలోకి వచ్చారు. ముగ్గురు మహిళలు ప్రమిలా మల్లిక్, ఉషా దేవి, తుకుని సాహులను క్యాబినెట్‌లోకి సీఎం నవీన్ పట్నాయక్ తీసుకున్నారు. సమీర్ రంజన్ దాస్, అశ్విని కుమార్ పాత్రా, ప్రీతి రంజన్ ఘదాయ్, శ్రీకాంత్ సాహు, తుషర్కంటి బెహెరా, రోహిత్ పుజారీ, రితా సాహు, బసంతి హేమ్‌బ్రమ్‌లు స్వతంత్ర హోదా మంత్రులుగా ప్రమాణం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement