Sunday, November 28, 2021

ఓసీపీ అండ‌ర్ గ్రౌండ్ లో ఘోర ప్ర‌మాదం..మృతి చెందిన మేనేజ‌ర్ పురుషోత్తం..

మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రి కేకే ఓసీపీ అండ‌ర్ గ్రౌండ్ లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అండ‌ర్ గ్రౌండ్ మేనేజ‌ర్ పురుషోత్తం అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. ఆయ‌న శ‌రీరమంతా బొగ్గు, బుర‌ద ఉండ‌గా,నోటి వ‌ద్ద తీవ్ర‌గాయాలు అయినట్టు స‌మాచారం. కాగా ఇటీవ‌ల కాలంలో సింగ‌రేణిలో ప‌లు ప్ర‌మాదాలు జ‌రుగుతుండ‌టం క‌ల‌వ‌ర ప‌రుస్తోంది. రీసెంట్ గా శ్రీరాంపూర్ లోని బొగ్గుబావిలో న‌లుగురు కార్మికులు మృతి చెందిన సంగ‌తి విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News