Thursday, April 25, 2024

నుపుర్​శర్మ తల నరికేసినట్టు వీడియో క్రియేట్​.. యూట్యూబర్​ అరెస్టు

మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత నుపుర్ శర్మను రెచ్చగొట్టేలా ఓ యూట్యూబర్ వీడియో తీశాడు. కశ్మీర్‌కు చెందిన ఫైజల్ వనీ నుపర్ శర్మ ఫొటోను పెట్టుకుని ఆమెను హతమారుస్తున్నట్టు ఓ వీడియో తీశాడు. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోపై అభ్యంతరాలు రావడంతో జమ్ము కశ్మీర పోలీసులు యూట్యూబర్ ఫైజల్ వనీని అరెస్టు చేశారు.

ఫైజల్ వనీ సొంతంగా డీప్ పెయిన్ ఫిటనెస్ అనే ఓ చానెల్ నడుపుతున్నాడు. వీడియోలో ఆ యూట్యూబర్ తన బాడీ చూపిస్తూ కనిపించాడు. ఓ కత్తిని గాలిలో తిప్పుతూ నుపుర్ శర్మ తల నరికేస్తున్నట్టుగా ఆ ఫొటోను నరికేశాడు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన ఈ వీడియో తీయడంతో ఇప్పుడది వైరల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement