Wednesday, April 24, 2024

కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన నా ఆల్ టైం ఫేవ‌రేట్.. రాజ‌మౌళి

హీరో ఎన్టీఆర్ ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఎన్టీఆర్ ఒక కంటి నొస‌తో యాక్టింగ్ చేయ‌గ‌ల‌డ‌ని పొగిడారు. కాగా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర టీమ్ పాల్గొననున్నారు. దీని కోసం ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్ ఆర్ ఆర్ టీంతో ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్ కేటీ వాల్ష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కేటీ వాల్ష్ లాస్ ఏంజెల్స్ టైమ్స్ తో పాటు కొన్ని మీడియా సంస్థలకు ఎంటర్టైన్మెంట్ విభాగంలో ప్రతినిధిగా పని చేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలోని హాలీవుడ్ మీడియా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , దర్శకుడు రాజమౌళిలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.

ఈ సందర్భంగా… నాటు నాటు సాంగ్ కోసం రాజమౌళి 65 రాత్రులు టార్చర్ చేశారని చెప్పారు ఎన్టీఆర్. నాటు నాటు సాంగ్ ని 12 రోజులు షూట్ చేశాం. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు. నాటు నాటు సాంగ్ పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ వేదికపై రాజమౌళి.. ఎన్టీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన నా అన్ని చిత్రాలలో ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పాలి. ఇంత వరకు నేను అంత మంచి సన్నివేశాలు డైరెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ ఒక కంటి నొస మీద కెమెరా పెడితే… ఆ ఒక్క కంటి నొసతో యాక్టింగ్ చేయగలడు. ఎన్టీఆర్ అంత టాలెంటెడ్ అంటూ రాజమౌళి ఆకాశానికి ఎత్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement