తోటి భారతీయుడిగా గర్వంగా ఉందని చెబుతూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా అమెరికాలో ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలుసు. గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో రెండు కేటగిరిలలో నామినేట్ అయ్యింది. అందులో ఓ కేటగిరీలో కీరవాణి గారు అవార్డ్ పొందారు. ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప అద్భుతమైన పాటలను అందించారు కీరవాణి గారు. రాజమౌళి గారి శ్రమ.. కీరవాణి సంగీతంతో ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ అద్భుతమైన విజయం అందుకుంది.
ఇందుకు తోటి భారతీయుడిగా గర్వకారణంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం గురించి మాట్లాడుతూ.. భారతీయులందరూ తమకు అందించిన ప్రేమ.. ఆప్యాయతతోనే ఇది సాధ్యమైందని.. దీనిని సినీ సోదరులు.. భారతీయ చలనచిత్ర సోదరులు అందించిన విజయం. జర్నలిస్టులు.. భారతీయ మీడియా.. మా కుటుంబసభ్యులు.. స్నేహితులు.. అభిమానులు అందించిన అద్భుతమైన విజయం అన్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రయాణంలో తాను భాగమైనందకు సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర విజయాన్ని సాధ్యం చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.