Thursday, April 18, 2024

బ్రెండ‌న ఫ్రేసర్ తో ఎన్టీఆర్.. వైర‌ల్ గా ఫొటో

మ‌రికొన్ని గంట‌ల్లో ఆస్కార్ వేడుక అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నుంది. ఈ వేడుకలకు ముందు జరిగే కొన్ని పార్టీలు,ఫంక్షన్స్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ అటెండ్ అవుతుంది. ఇక ఈ వేడుకల్లో స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్.. ఎన్టీఆర్ హాలీవుడ్ దిగ్గజ నటులను కలిసి వారితో దిగిన ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. రాంచరణ్‌,తారక్‌ హాలీవుడ్ సెలబ్రిటీలు,టెక్నీషియన్లను కలుసుకుని వాటి ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటే..ఆఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అవి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మరో హాలీవుడ్ స్టార్ ను కలిశారు. ది మమ్మీ, ది వేల్‌ ఫేం బ్రెండన్‌ ఫ్రేసర్‌ ‌నుకలిశాడు తారక్‌. జార్జ్‌ క్లూనీ, ఏంజెలా బస్సెట్‌, కేట్‌ బ్లాంచెట్‌ హోస్టులుగా వ్యవహరించిన MPTF Night పార్టీ ఈవెంట్‌లో ఇలా ఫ్రేసర్‌తో సందడి చేశాడు తారక్‌. హాలీవుడ్‌ స్టార్‌ తో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్ దిగిన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement