Thursday, October 10, 2024

Tributes – అన్న ఎన్టీఆర్ కి నంద‌మూరి కుటంబ‌స‌భ్య‌లు ఘ‌న నివాళి..

హైద‌రాబాద్ – స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి నేడు. నటుడిగా, నాయకుడిగా అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా మారిన ఎన్టీఆర్ శతజయంతి నాడు తెలుగువారంతా ఆయన్ని స్మరించుకుంటున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇరువురూ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా ఎన్టీఆర్ జయంతి నిర్వహిస్తున్నారని తెలిపారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ అగ్రగామిగా నిలిచారన్నారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు టీడీపీని స్థాపించిన తన తండ్రి, అధికార పగ్గాలు చేపట్టాక పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందన్నారు. మహిళలకు ఆస్తి హక్కు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని, ఆయనకు కుమారుడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

అనంతరం జూ. ఎన్టీఆర్ కూడా తన తాతగారికి నివాళులు అర్పించారు. జూ.ఎన్టీఆర్ రావడంతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే నందమూరి రామకృష్ణ, పురందేశ్వరి, సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement