Friday, December 6, 2024

ఎన్టీఆర్ 30నుండి.. అదిరిపోయే అప్ డేట్

స్టార్ హీరో ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి.దర్శకుడిగా రంగాన్ని సిద్ధం చేస్తున్నారు కొరటాల శివ. కల్యాణ్ రామ్ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. 2024 ఏప్రిల్ 5వ తేదీన సినిమా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ 30వ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల‌లో స్టార్ట్ అవుతుంద‌ని మేక‌ర్స్ స్ప‌ష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ఉండకపోవచ్చనీ .. కొరటాలతో ఉండకపోవచ్చనే వార్తలు షికారు చేశాయి. తాజాగా చేసిన ట్వీట్ ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలిసి హీరో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏప్రిల్ 5 .. 2024లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement