Friday, April 19, 2024

Tokyo olympics: సెమీస్ లో జకోవిచ్ ఓటమి..

టెన్నిస్ దిగ్గజ ఆటగాడు నోవాక్ జకోవిచ్కు టోక్యో ఒలింపక్స్ లో నిరాశ ఏదురైంది. సెమీఫైనల్ లో జర్మినీ ఆటగాడు అలెగ్జాండర్ పై ఓటమి పాలయ్యాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ 1-6, 6-3, 6-1తో జకోవిచ్ ను చిత్తు చేశాడు. ఒలింపిక్ స్వర్ణం గెలిచి ఈ ఏడాది గోల్డెన్ స్లామ్ (ఓ ఏడాదిలో అన్ని గ్రాండ్ స్లామ్ టోర్నీల టైటిళ్లతో పాటు ఒలింపిక్ స్వర్ణం) నమోదు చేయాలని ఆశించిన జకోవిచ్ కు ఈ పరాజయం తీవ్ర నిరాశ కలిగించింది. ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గిన జకోవిచ్… ఒలింపిక్స్ తో పాటు యూఎస్ ఓపెన్ గెలిస్తే గోల్డెన్ స్లామ్ నమోదు చేయగలిగేవాడు. కానీ, సెమీస్ లో ఓటమి ఆ అవకాశాన్ని దూరం చేసింది. టెన్నిస్ చరిత్రలో జర్మనీ దిగ్గజం స్టెఫీ గ్రాఫ్ ఒక్కతే గోల్డెన్ స్లామ్ నమోదు చేయగలిగింది. స్టెఫీ 1988లో ఈ ఘనత సాధించింది.

ఈ పోరులో తొలి సెట్ ను గెలిచిన జకోవిచ్ అదే ఊపును కొనసాగించడంలో విఫలమయ్యాడు. రెండో సెట్ లో పుంజుకున్న జర్మనీ ఆటగాడు జ్వెరెవ్ ఎక్కడా జకోవిచ్ కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు. మరో సెమీఫైనల్లో రష్యా ఆటగాడు కరెన్ ఖచనోవ్ 6-3, 6-3తో స్పెయిన్ కు చెందిన కరెనో బుస్టాపై నెగ్గాడు. టెన్నిస్ పురుషుల విభాగం సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ జ్వెరెవ్, ఖచనోవ్ మధ్య జరగనుంది. ఇక, సెమీఫైనల్ మ్యాచ్ ల్లో ఓటమిపాలైన జకోవిచ్, బుస్టా కాంస్యం కోసం పోరాడనున్నారు.

ఇది కూడా చదవండి: కండోమ్‌తో ప్రయోగం చేసింది..మెడల్ కొట్టింది

Advertisement

తాజా వార్తలు

Advertisement