Thursday, April 25, 2024

వెటర్నరీ, హార్టికల్చర్‌ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. 207 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 207 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ను కమిషన్‌ జారీ చేసింది. వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హజ్బండరీ శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(క్లాస్‌-ఏ, బి) పోస్టులు, డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ విభాగంలో 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది.

వెటర్నరీ ఖాళీలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రయ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement