Wednesday, April 24, 2024

1365 గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. జనవరి 24నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌: గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇవ్వాల (శుక్రవారం) ఈ మేరకు 1365 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగ భర్తీలో భాగంగా వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలకాగా, తాజాగా గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 24నుంచి ప్రారంభమయై ఫిబ్రవరి 23 వరకు కొనసాగించనున్నారు. మొత్తం 107 విభాగాల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు టీఎస్‌పీఎస్సీ అవకాశం కల్పించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement