Monday, September 25, 2023

కోహ్లీనే కాదు… పుజారాతో జాగ్రత్త!

ఇంగ్లండ్లోని ఓవల్‌ వేదికగా 7వ తేదీ నుంచి జరుగనున్న ఐసీసీ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఇటు ఆస్ట్రేలియా, ఇటు భారత జట్టు సన్నద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇరు జట్లు సైతం పట్టుదలగా నెట్‌ ప్రాక్టీస్‌లు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవాలంటే కోహ్లీ, పుజారాను ఆసీస్‌ బౌలర్లు కట్టడి చేయాల్సి ఉందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ రిక్కీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డారు.

- Advertisement -
   

ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణించి, మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. మరోవైపు ఛతేశ్వర్‌ పుజారా కూడా ఇంగ్లీష్‌ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్‌ టీమ్‌కి ఆడి ఆ పిచ్‌లపై అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. దీంతో ఈ ఇద్దరి వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుకి ప్రమాదం పొంచి ఉందని రిక్కీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. అందుకనే రాబోయే ఫైనల్స్‌లో ఈ ఇద్దరినీ కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని ఆస్ట్రేలియా బౌలర్లు సిద్ధం చేసుకోవాలంటూ సూచించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement