Thursday, April 25, 2024

Miss శెట్టి మిస్టర్ Polishetty నుండి.. సాంగ్ అప్ డేట్

చాలా గ్యాప్ త‌ర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క న‌టిస్తోన్న చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty. హీరోగా న‌వీన్ పొలిశెట్టి న‌టిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో న‌వీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువ‌కుడి పాత్రలో క‌నిపించ‌నుండ‌గా.. అనుష్క 40 ఏండ్ల మ‌హిళ‌గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా కొత్త అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ మూవీ నుంచి నోనోనో అంటూ సాగే మొదటి సాంగ్‌ను మార్చి 22న‌ లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఈ పాట విన్న తర్వాత ప్రతీ మ్యూజిక్‌ లవర్‌ అవును..అవును.. అవును అంటారంటూ మేకర్స్ అందించిన అప్‌డేట్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.#MSMP పేరుతో ఉన్న వాట్సాప్‌ చాటింగ్ ద్వారా సరికొత్తగా ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ను అందించి సినిమాపై ఆసక్తిని పెంచుతోంది స్వీటీ టీం.

Advertisement

తాజా వార్తలు

Advertisement