Friday, April 19, 2024

సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ప‌ద్మ అవార్డుల నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌

ప‌ద్మ అవార్డులు-2022 నామినేష‌న్ల‌ను 15 సెప్టెంబ‌ర్‌,2021 వ‌ర‌కు స్వీక‌రించ‌నున్న‌ట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్‌లైన్‌లో పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే స్వీకరించబడతాయ‌ని పేర్కొంది.

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి. 1954 లో ప‌ద్మ అవార్డుల‌ను స్థాపించారు. ఈ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబడతాయి. ఈ అవార్డు ‘వర్క్ ఆఫ్ డిస్టింక్షన్’ను గుర్తించటానికి ప్రయత్నిస్తుంది. క‌ళ‌లు, సాహిత్యం, విద్య‌, ఆట‌లు, వైద్యం, సామాజిక సేవ‌, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి అన్ని రంగాలలో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు / సేవలకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. కాగా వైద్యులు, శాస్త్రవేత్తలు తప్ప పీఎస్‌యులతో పనిచేసే వారితో సహా ప్రభుత్వ ఉద్యోగులు పద్మ అవార్డులకు అర్హులు కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement