Friday, April 19, 2024

కొత్త రూల్.. కరోనా టీకా వేయించుకోకుంటే నెల జీతం కట్

కరోనా టీకా తీసుకునేందుకు వెనకాడుతున్న ఉద్యోగులను దారిలోకి తెచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజాబాద్ జిల్లా యంత్రాంగం తాజాగా ఓ కొత్త నిబంధన ప్రవేశపెట్టింది. దీని ప్రకారం టీకా వేసుకునేందుకు అంగీకరించని ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతం చెల్లింపును అధికారులు నిలిపివేయనున్నారు.

ఈ కొత్త నిబంధనను అమలు చేయాలంటూ జిల్లా మెజిస్ట్రేట్ చంద్ర విజయ్ సింగ్ అధికారులను మౌఖికంగా ఆదేశించారని చీఫ్ డెవలెప్‌మెంట్ ఆఫీసర్ చర్చిత్ కౌర్ బుధవారం నాడు తెలిపారు. టీకా వద్దంటున్న ఉద్యోగులపై శాఖాపరమైన విచారణ చేపట్టడంతో పాటూ ఆ నెల జీతం చెల్లించడాన్ని నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కోశాధికారికి, వివిధ డిపార్టమెంట్లకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారులకు ఇప్పటికే ఈ ఆదేశాలు వేళ్లాయన్నారు. ఈ నిబంధన ప్రభావం చూపిస్తోందని.. అనేక మంది ఉద్యోగులు టీకా తీసుకునేందుకు రెడీ అవుతున్నారని కూడా సదరు అధికారి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement