Thursday, June 1, 2023

నో సార్‌, నో మేడమ్‌, ఓన్లీ టీచర్‌

కేరళ ప్రభుత్వం మరో ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సాధారణంగా స్కూల్‌లో పిల్లలు ఉపాధ్యాయులను సార్‌ అని, ఉపాధ్యాయిని అయితే మేడమ్‌ అని సంబోధిస్తుంటారు. బయట కూడా చాలా మంది గౌరవంగా సర్‌, మేడమ్‌ అనే సంబోధిస్తారు. కేరళలో ఇకపై స్కూల్స్‌లో సర్‌, మేడమ్‌ అని సంబోధించవద్దని కేరళ బాలల హక్కుల కమిషన్‌ తెలిపింది. ఆడ, మగ ఎవరైనా ఉపాధ్యాయులను ఇక పై టీచర్‌ అని మాత్రమే సంబోధించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు ఈ మేరకు బాలల హక్కుల కమిషన్‌ మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యా శాఖను ఆదేశించింది.

టీచర్‌ అనే పదం స్త్రీ , పురుషలు ఇద్దరికీ వర్తిస్తుందని తెలిపింది. పిల్లలకు చిన్న నాటి నుంచే స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని చెప్పేందుకే ఈ నూతన వరవడికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది. చిన్న నాటి నుంచే పిల్లల్లో లింగవివక్ష లేకుండా సమానత్వం అలవరిచేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.

- Advertisement -
   

కేరళ స్టేట్‌ కమిషన్‌ ప్యానల్‌ చైర్‌పర్సన్‌ కేవీ మనోజ్‌, విజయ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం పాఠశాలల్లో కేవలం టీచర్‌ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని సాధారణ విద్యాశాఖకు మార్గనిర్ధేశం చేసింది. ఈ నేపథ్యంలోనే బాలల హక్కుల కమిషన్‌ తాజా ఉత్వర్వులను వెలువరించింది. టీచర్‌ అని పిలవడం వల్ల విద్యార్ధులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం మరింత పెరుగుతుందని బాలల హక్కుల కమిషన్‌ అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement