Thursday, March 28, 2024

పాలిటిక్స్‌ వద్దు.. కొత్త వేరియంట్‌ను కట్టడి చేస్తాం: లోక్‌సభలో మన్సుఖ్ మాండవీయ

ఒమిక్రాన్ కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. ఒమిక్రాన్‌పై రాజకీయాలు చేయడం తగదని ఆయన మండిపడ్డారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) దేశంలోకి ప్రవేశించిన తర్వాత దాని నివారణ ఎలా అనే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ప్రస్తుత టీకాలు (Vaccines) ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించగలవా? బూస్టర్ డోసు ఇవ్వక తప్పదా? అనే చర్చలు జరిగాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన పరిశోధన సంస్థ జీనోమ్ కన్సార్టియం ముఖ్యమైన సూచనలు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల ద్వారా స్వల్ప స్థాయిలోనే యాంటీబాడీలు వస్తున్నాయని, వాటితో ఒమిక్రాన్ వేరియంట్‌ను నిలువరించడం కష్టమేనని తెలిపింది. కాబట్టి, బూస్టర్ డోసు అందించాని సూచనలు చేసింది. అంతేకాదు, ఎవరికీ బూస్టర్ డోసు ఇవ్వాలనే విషయంపైనా వివరణలు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement