Friday, April 19, 2024

ఇక వ‌ణుకుడే..! హైదరాబాద్​కు ‘ఎల్లో అలర్ట్’..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి పంజా విసురుతుంది. హైదరాబాద్‌‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని, ఈ మేరకు సిటీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. న‌గ‌రంలో ఇవ్వాల్టి నుంచే విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, సిటీవాసులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. న‌గ‌రంలో 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక విపరీతంగా మంచు కురిసే అవకాశం ఉన్న కారణంగా వాహనదారుల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పొగ మంచు కారణంగా ఉదయం వేళల్లో, అలాగే సాయంత్రం పూట ఎదురుగా వచ్చే వాహనాలు అస్పష్టంగా కనిపించే అవకాశం ఉందని, ఫలితంగా యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఆస్తమా, సైనసైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement