Saturday, December 7, 2024

CM Revanth | ఎవ‌రు అడ్డు వ‌చ్చినా… మూసీ ప్ర‌క్షాళ‌న చేస్తాం !

మూసి పరివాహక ప్రాంతంలో రెండున్నర కిలోమీటర్లు మూసి పునరుజ్జీవ పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు…

వరంగా మారాల్సిన‌ మూసీ నది.. శాపంగా మారితే బాగుచేయవద్దా అని రేవంత్ ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన ప్రాజెక్టు చేసి తీరుతామని ప్రకటించారు. ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. కేసీఆర్,కేటీఆర్, హరీష్ దమ్ముంటే మూసి ప్రక్షాళన ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నించాలని సవాల్ చేశారు.

ఎవరు అడ్డుకున్నా బుల్డోజర్లతో తొక్కుకుపోయి పనులు చేయిస్తామన్నారు. ఇవాళ చూపించినది ట్రైలర్ మాత్రమేనని .. వాడపల్లి నుంచి జనవరిలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ ప్రాంతంలో కులవృత్తులు చేసుకునే పరిస్థితి లేదని, ఇక్కడ పండిన పంటలను తినే పరిస్థితి లేదు.. ఇక్కడి చెరువుల్లో చేపలు బ్రతికే పరిస్థితి లేద‌ని నదిఒడ్డున పెంచే గొర్రె మాంసాన్ని కొనే పరిస్థితి లేదన్నారు.

ఇక్కడ పశువుల పాలు తాగాలన్నా ఆలోచించాల్సిన దుస్థితి ఏర్ప‌డిందని అన్నారు. పాడిపంటలతో ఎంతో సంతోషంగా బతికిన ఇక్కడి ప్రజలు.. ఇపుడు భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. బీఆర్ఎస్ నాయకులకు దోచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేయడం తెలియదని.. అందుకే మూసీ ప్రక్షాళన ఆపాలని చూస్తున్నారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement