Wednesday, April 24, 2024

జగన్​ ఎన్ని కుతంత్రాలు పన్నినా.. యువగళం పాదయాత్ర ఆగదు : నారా లోకేష్

టీడీపీ నేత రానా లోకేశ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పాద‌యాత్ర 37వ రోజు పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ఆరంభ‌మైంది. టిడిపి యువ‌నేత‌, సోద‌రుడు వంగవీటి రాధ కృష్ణ నాతోపాటు న‌డిచారని లోకేష్ వివరించారు. గంధబోయినపల్లి, బీదవారిపల్లి, చింతపర్తిలో ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారన్నారు. యాత్ర‌లో ఎంతో మంది యువ‌కులు, మ‌హిళ‌లు, వృద్ధులు త‌మ స‌మ‌స్య‌ల‌ను లోకేశ్ కు విన్న‌వించుకుంటున‌నారు. ముస్లిం సోద‌రుల‌తో కూడా లోకేశ్ స‌మావేశ‌మై వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. జ‌గ‌న్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు ప‌న్నినా పాద‌యాత్ర ఆగ‌దన్నారు. వందలాది మంది పోలీసులతో పాద‌యాత్ర‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. విద్యార్థులు పాద‌యాత్ర‌కి రాకుండా కాలేజీ గేట్ల‌కు తాళాలేయించారు. యువ‌గ‌ళం నిన్ను నిల‌దీస్తూనే ఉంటుందని నారా లోకేష్ జ‌గ‌న్ కు వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement