Friday, April 19, 2024

తెలంగాణలో మాస్కు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్కులు ధరించని వారికి రూ.1000 ఫైన్ విధించనుంది. దీనిపై ఆదివారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలంతా మాస్కులు ధరించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రయాణాల్లో మాస్కులను తప్పనిసరి చేశారు. మాస్కు ధరించకపోతే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టం సెక్షన్ 188 కింద శిక్షార్హులు అవుతారని సీఎస్ తెలిపారు.

అటు హైదరాబాద్‌లోని రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్‌లలోనూ కఠినంగా కరోనా నిబంధనలను అమలు చేయనున్నారు. సామాజిక దూరం పాటించకుండా, గుంపులుగా గుంపులుగా ప్రజలు కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు లేకుండా బయట సంచరిస్తే పెట్టీ కేసులు పెడతామని పోలీసులు స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమించే షాపులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement