Wednesday, December 7, 2022

నో ఎంట్రీకి సీక్వెల్.. త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్న హీరోలు ..

కొత్త‌గా ప్ర‌యోగం చేయ‌నున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్..త్రిపాత్రాభిన‌యం చేయ‌నున్నాడు. ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టుడు అనిల్ క‌పూర్, ఫ‌ర్దేన్ ఖాన్ కూడా మూడు పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో ఏకంగా తొమ్మిది మంది హీరోయిన్ ల‌ను తీసుకోనున్నారు. కాగా స‌ల్మాన్, అనిల్ , ఫ‌ర్దేన్ న‌టించిన చిత్రం నో ఎంట్రీ. ఈ మూవీకి అనీష్ బ‌జ్మీ డైరెక్ట‌ర్. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రానుంది. వ‌చ్చే ఏడాది మొద‌ట్లో నో ఎంట్రీ సినిమా సీక్వెల్ ను ప‌ట్టాల పైకి తీసుకు వెళ్లాల‌ని అనీష్ బ‌జ్మీ ప్ర‌య‌త్నం చేస్తున్నాడని స‌మాచారం.దీని కోసం అనీష్ బ‌జ్మీ కథ ను కూడా సిద్ధం చేస్తున్నారు. నో ఎంట్రీ సినిమాను మ‌రింత బెస్ట్ గా చేయ‌డానికి స‌ల్మాన్ ఖాన్, అనిల్ క‌పూర్, ఫ‌ర్ధేన్ ఖాన్ లు త్రిపాత్రాభినయం చేస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే రీ ఎంట్రీ లో న‌టించిన లారా ద‌త్తా, ఈషా దేఓల్ తో పాటు సెలీనా జైట్లీ తో కూడా చిత్ర బృందం సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement