Friday, March 29, 2024

పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేశారనే వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస్తామని చెప్పారు. బుధవారం వికారాబాద్‌లో మంత్రి సబిత పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రద్దు అంశంపై మంత్రి వివరణ ఇచ్చారు.

రాష్ట్రంలో ఇంటర్ సెండర్ ఇయర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సర్కారు…. తాజాగా ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేసిందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పరీక్షలు నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థుల‌ను ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇదీ చదవండి: గులాబీ గూటికి ఎల్.రమణ..! కొత్త తమ్ముడు ఎవరు..?

Advertisement

తాజా వార్తలు

Advertisement