Thursday, March 28, 2024

మొద‌టిసారి ఈలాంటి పాత్ర చేశాను….

విశ్వక్‌ సేన్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘దాస్‌ కా ధమ్కీ’. విశ్వక్‌ సేన్‌ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రం లో నివేదా పేతురాజ్‌ కథానాయిక. ‘దాస్‌ కా ధమ్కీ’ ఉగాది రోజుల విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ నివేదా పేతురాజ్‌ మీడియా సమావేశంలో ‘దాస్‌ కా ధమ్కీ’ విశేషాలని పంచుకున్నారు.
పాగల్‌ సినిమాలో మీరిద్దరు కలిసిపనిచేశారు. మళ్లిd కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది?
‘పాగల్‌’ చేస్తున్నప్పుడే ‘ఓరి దేవుడా’కి కాల్‌ వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత ధమ్కీ స్క్రిప్ట్‌ విన్నాను. చాలా యూనిక్‌ కథ. విశ్వక్‌ సేన్‌ డైరెక్షన్‌ చేయడం మరింత స్పెషల్‌ గా మారింది.
ఇలాంటి పాత్రలో గతంలో ఎదురైందా ?
లేదు. కెరీర్‌ లో మొదటిసారి ఇలాంటి పాత్ర చేశాను. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.


పాగల్‌లో విశ్వక్‌ హీరోగా మాత్రమే చేశారు. కానీ ఇందులో హీరోతో పాటు- దర్శకుడు నిర్మాతగా కూడా చేశారు కదా .. ఎలా అనిపించింది ?
హీరో, నిర్మాతగా చేయడం వేరు. కానీ దర్శకత్వం ఒక ప్రధాన భాద్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు భాద్యతలని తీసుకున్నారు విశ్వక్‌. నిర్మాతగా పూర్తి న్యాయం చేశారు. ఇక దర్శకుడిగా అయితే విశ్వక్‌ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్‌ సేన్‌ లో చూశాను.
ఎన్టీఆర్‌విశ్వక్‌ని దర్శకత్వం ఆపేయాలని అన్నారు కదా ?
విశ్వక్‌ గొప్ప ఎనర్జీ వున్న దర్శకుడు. అయితే తానే నటు-డిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్‌ చేయాలని నా అభిప్రాయం. విశ్వక్‌ లో చాలా మాస్‌ వుంది. లోకేష్‌ కనకరాజ్‌ లాంటి టచ్‌ వుంది. బాలకృష్ణ గారు లాంటి పెద్ద మాస్‌ హీరోలని డైరెక్ట్‌ చేసే సత్తా విశ్వక్‌ లో వుంది. తనకి గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్‌ స్టర్‌ డైరెక్టర్‌ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి.
ఈ సినిమాపై మీ అంచనాలు ఏమిటి ?
దాస్‌ కా ధమ్కీ మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌ -టైనర్‌. విశ్వక్‌ కెరీర్‌ లో మైల్‌ స్టోన్‌ మూవీ గా నిలుస్తుంది.
దాస్‌ కా ధమ్కీ బలాలు ఏమిటి ?
ప్రధాన బలం కథ. తర్వాత నటీ-నటు-లు. రావు రమేష్‌ గారు చాలా అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్‌ కూడా ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.
దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ?
వుంది కానీ ఇప్పుడే కాదు. నిర్మాణం మాత్రం చేసే ఆలోచన లేదు. నటనతో పాటు- బిజినెస్‌ పై కూడా దృష్టి పెడుతున్నా. చెన్నయ్‌ లో రెస్టారెంట్‌ ఒకటి ప్రారంభించా.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?
సుస్మిత గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా.
హిందీ టీ- సిరిస్‌ లో ఒక
సినిమా చేస్తున్నా.

Advertisement

తాజా వార్తలు

Advertisement