Thursday, March 28, 2024

నిసార్‌ శాటిలైట్‌ వచ్చేసింది..

బెంగళూరు: బెంగళూరు: పౌర-అంతరిక్ష సహకారంతో అమెరికా-భారత్‌ సంబంధాలను మెరుగుపరిచే దిసగా ముందడుగు పడింది. అమెరికా వైమానిక దళానికి చెందిన రవాణా విమానం నాసా-ఇస్రో ఉపగ్రహంతో బెంగళూరులో ల్యాండ్‌ అయింది. ఆ ఉపగ్రహాన్ని అమెరికా యుద్ధ విమానంలో భారత్‌కు తరలించారు. నాసా-ఇస్రో సింథటిక్‌ ఎపర్చర్‌ (ఎన్‌ఐఎస్‌ఎఆర్‌) ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్‌, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమెరికా, భారత్‌ కలిసి సంయుక్తంగా ఈ మిషన్‌ చేపట్టనున్నాయి. ‘నిసార్‌’ ఉపగ్రహం ద్వారా భూ పర్యావరణ వ్యవస్థలలో మార్పులను గమనిస్తారు. అలాగే భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సముద్ర మట్టం పెరుగుదల వంటి ప్రకృతి వైపరీత్యాల సంకేతాలను గుర్తించడంతోపాటు ఈ శాటిలైట్‌ హచ్చరికలు కూడా జారీ చేస్తుంది. తద్వారా భూమి క్రస్ట్‌, ఉపరితలంలో జరుగుతున్న మార్పుల అధ్యయానికి ఇది స#హకరిస్తుంది.

కాగా, #హమాలయాల్లోని హమానీనదాలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల పరిశీలన, పర్యవేక్షణకు ఈ శాటిలైట్‌ను ఇస్రో వినియోగిస్తుంది. ఎస్‌యూవీ వా#హనం పరిమాణం కలిగిన నిసార్‌ ఉపగ్రహం, సుమారు 2,800 కిలోల బరువుంటుంది. ఉపగ్ర#హంలో ఎల్‌బ్ఖ్యాండ్‌, ఎస్‌-బ్యాండ్‌, సింథటిక్‌ ఎపర్చర్‌ రాడార్‌ (ఎస్‌ఏఆర్‌) వంటి పరికరాలు ఉన్నాయి. ఎస్‌-బ్యాండ్‌, ఎస్‌ఏఆర్‌ ద్వారా మేఘాలు, దట్టమైన అడవులపై నుంచి కూడా కింద ఉన్న వాటిని స్పష్టంగా చూడవచ్చు. అధిక రిజల్యూషన్‌ చిత్రాలను రూపొందించవచ్చు. వచ్చేఏడాది ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ శాటిలైట్‌ను ధ్రువ కక్ష్యలోకి పంపనున్నారు. అమెరికా, భారత్‌ మధ్య పౌర, అంతరిక్ష స#హకారంలో మరో ప్రధాన అడుగు ఈ మిషన్‌ అని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement