Saturday, April 20, 2024

డిసెంబర్ నాటికి నిప్టీ 18,200కు చేరొచ్చు.. నిషిత్‌ మాస్టర్‌ అంచనా

డిసెంబర్‌కల్లా నిఫ్టీ 18,200 మార్క్‌ను తాకే అవకాశం ఉందని యాక్సిస్‌ సెక్యురిటీస్‌ పోర్ట్‌ ఫోలియో మేనేజర్‌ నిషిత్‌ మాస్టర్‌ చెప్పారు. వచ్చే ఆరునెలల్లో మార్కెట్లు ఎటువైపు పయనిస్తాయన్న అంశంపై నిషిత్‌ మాస్టర్‌ని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలలో ఆర్థికమాంద్యం ఏర్పడే అవకాశం ఉన్నందున మార్కెట్లు సమీప కాలంలో అస్థిరంగా ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పిన ఆయన మధ్య కాలంలో అవి స్థిరీకరించబడి, మరింతపైకి వెళ్లాలని ఆశిస్తున్నామని అన్నారు. 2022 ప్రథమార్థంలో స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌లో భారీ పతనం కనిపించిందని అన్నారు. ఇటీవల పతనం తర్వాత గ్లోబల్‌ పీర్‌లకు వ్యతిరేకంగా మనం ఎలా నిలబడాలి అన్న ప్రశ్నకు నిషిత్‌ మాస్టర్‌ సమాధానమిస్తూ మెరుగైన వృద్ది అంచనాలు, లిస్టెడ్‌ కంపెనీల మెరుగైన ఫలితాల కారణంగా భారతదేశం ప్రస్తుతం అత్యంత ఖరీదైన, అభివృద్ది చెందుతున్న మార్కెట్‌లలో ఒకటిగా మిగిలిపోయింది. బాగా అభివృద్ధి చెందిన మార్కెట్లను పోల్చి చూస్తే భారత మార్కెట్‌ విస్తృతమైనదని, ఆర్థికంగా బలమైనదని అన్నారు. 2022లో యుఎస్‌, యూరప్‌లో ఆర్థికమాంద్య ఏర్పడుతుందని మదుపరులు ఆందోళన చెందుతున్నారని, ఇంధన వస్తువుల ధరల పెరిగే సూచనలున్నాయని, మిగతా వస్తువుల ధరల్లో మార్పులుండొచ్చని అన్నారు.

ఐరోపాలో శీతాకాలం వచ్చిన తరువాత ఇంధనం కొరత ఏర్పడితే ధరలు ఆకాశాన్ని తాకుతాయని, అలాగే ఉక్కు అల్యూమినియం ధరలు వేగంగా పుంజుకోగలవని ఆయన అన్నారు. 2022లో మొదటి ఆరునెలలు యుద్ధం, ద్రవ్యోల్బణం, ఫెడ్‌ రేట్ల పెంపు, వడ్డీ రెట్ల పెరుగుదల అనే అంశాలు ప్రధాన పాత్ర పోషించాయని అన్నారు. పెట్టుబడిదారుడు లేదా వ్యాపారి ఎంత అనుభవజ్ఞుడైనా లేదా తెలివైన వాడైనా స్టాక్‌ మార్కెట్‌ మనకు కొత్త విషయాలను బోధిస్తూనే ఉందన్నారు. ”ముఖ్యంగా ప్రాథమికంగా బలహీనమైన కంపెనీలలో మార్కెట్‌ కబుర్లు లేదా వదంతులతో ఊగిపోకూడదు. వాల్యూయింగ్‌ కంపెనీలకు ఉచిత నగదు ప్రవాహ ఉత్పత్తి చాలా సందోర్బోచితంగా ఉంటుంది. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టేటప్పుడు, ఎల్లప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితోనేఉండాలి. పెట్టుబడిలో క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం” అని నిషిత్‌ మాస్టర్‌ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement