Thursday, April 18, 2024

‘ఆచార్య’ నుండి నీలాంబ‌రి ఫుల్ సాంగ్..’చెర్రీ’ స్టెప్స్ అదుర్స్..

మెగాస్టార్ చిరంజీవి..ఆయ‌న త‌న‌యుడు..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం ఆచార్య‌. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోని నీలాంబరి అనే ఫుల్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ నీలాంబరి సాంగ్ రామ్ చరణ్ .. పూజా హెగ్డే ల మధ్య… రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కింది. అలాగే… నీలాంబరి అని సాగే ఈ పాట.. లిరిక్స్‌ కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటతో ఈ సినిమాకు మరింత క్రేజ్‌ వచ్చింది. కాగా.. ఈ సినిమా ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా లో మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా కాజ్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. మరో జంటగా రామ్‌ చరణ్‌ – పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే… పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. అలాగే ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్… మరియు పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement