Friday, April 26, 2024

స్వదేశంలో మూడు దేశాలతో సిరీస్‌

వచ్చే ఏడాది భారత జట్టు స్వదేశంలో వరుసగా మూడుదేశాలతో వన్డే, టీ 20తో పాటు టెస్ట్‌ సిరీస్‌లు ఆడనుంది. శ్రీలంక, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జ ట్టు భారత పర్యటనకు రానున్నాయి. ఈ ప ర్యటన, మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ , వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఉన్నందున ఈ మూడు జట్ల సిరీస్‌ భారత జట్టుకు ప్రాక్టీస్‌గా ఎంతగానో ఉపయోగపడనుంది. అంతే కాదు వన్డే ప్రపంచకప్‌ జట్టుని ఎంపిక చేసేందుకు స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లు మంచి అవకాశం.


ఇండియా టూర్‌లో శ్రీలంక జట్టు టీ 20, వన్డే సిరీస్‌ ఆడనుంది. మూడు టీ 20ల సిరీస్‌లో మొదటి టీ 20 జనవరి 7న రాజ్‌కోట్‌ లో జరగనున్నాయి. మొదటి వన్డే జనవరి 10వ తేదీన గువహతిలో, రెండో వన్డే జనవరి 12 కోల్‌ కతాలో, మూడో వన్డే జనవరి 15న త్రివేండ్రంలో జరగనున్నాయి. భారత పర్యటనలో న్యూజిలాండ్‌ మూడు వన్డేల సిరీస్‌, మూడు టీ 20 సిరీస్‌లు ఆడనుంది. మొదటి వన్డే జననరి18న హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. రాయ్‌పూర్‌లో జనవరి 21వ తేదీన రెండో వన్డే జరగనుంది. రాయ్‌పూర్‌ స్టేడియం ఆతిథ్యం ఇస్తున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. మూడో వన్డే ఇండోర్‌లో జనవరి 24న జరగనుంది. మూడు టీ 20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ జనవరి 27న రాంచీలో, రెండో టీ 20 లక్నోలో, మూడో టీ 20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగుతాయి.

ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి టెస్ట్‌ ఫిబ్రవరి 9వ తేదీన నాగ్‌పూర్‌లో మొదలవుతుంది. ఫిబ్రవరి 17న ఢిల్లిలో రెండో టెస్ట్‌, మార్చి 1న ధర్మశాలలో మూడో టెస్ట్‌ , మార్చి 9న అహ్మదాబాద్‌లో చివరి టెస్ట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఐదేళ్ల తరువాత తొలిసారి ఆసిస్‌, భారత టూర్‌కు వస్తోంది. 2007లో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియాను టీమిండియా 2-1తో ఓడించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇరు జట్ల మధ్య జరగనున్న చివరి బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ ఇదే కావడం గమనార్హం. ఈ టెస్ట్‌ సిరీస్‌ రెండు జట్లకు
చాలా కీలకం. ఎందుకంటే 2023లో లార్డ్స్‌ మైదానంలో జరగనున్న వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్‌ ఈ టెస్ట్‌ సిరీస్‌లో తప్పనిసరిగా గెలవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement