Thursday, April 25, 2024

తెలంగాణ లో కొత్తగా 3961 కరోనా కేసులు

తెలంగాణ‌లో ప్రతిరోజు అదే స్థాయిలో క‌రోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంట‌ల్లో మొత్తం 62,591 మందికి క‌రోనా టెస్ట్ లు చేయగా కొత్త‌గా 3,961 కేసులు నమోదు అయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం రాష్ట్రంలో నమోదు అయిన కేసుల సంఖ్య 5.32 ల‌క్ష‌లు దాటింది. ఇక‌ కరోనా కార‌ణంగా కొత్తగా 30 మంది చనిపోయారు. దీనితో రాష్ట్రంలో మొత్తం 2985 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు.

అలాగే గడిచిన 24 గంటల్లో 5559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిస్చార్జ్ అయిన వారి సంఖ్య 4,80,458 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement