Friday, March 29, 2024

న్యూజిలాండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ టీమ్‌ సౌథీ అరుదైన రికార్డ్‌

న్యూజిలాండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ టీమ్‌ సౌథీ అరుదైన రికార్డును కైవసం చేసుకున్నాడు. ఈ ఫార్మట్‌లో అతను భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో 78 సిక్స్‌లతో సౌథీ, ధోనీ సరసన చేరాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో అతను ఈ రికార్డుకు చేరువయ్యాడు. స్టువార్ట్‌ బ్రాడ్‌ ఓవర్‌లో మిడాఫ్‌ దిశగా భారీ సిక్స్‌ కొట్టాడు. దాంతో టెస్టుల్లో 78సిక్స్‌లు తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ (79 సిక్స్‌లు) రికార్డు బద్దలు కొట్టడానికి కివిస్‌ కెప్టెన్‌ మరో సిక్సర్‌ దూరంలో నిలిచాడు.

- Advertisement -

ఈ ఫార్మట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరంటే.. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌ కల్లమ్‌. ఈ విధ్వంసక ఓపెనర్‌ ఖాతాలో 107 సిక్స్‌లు ఉన్నాయి. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 91 సిక్సర్లతో ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆదుకున్న విలియమ్సన్‌..

సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌లో కివీస్‌ ఓటమి పాలైంది. వెల్లింగ్టన్‌లో జరుగుతున్న రెండు టెస్ట్‌లోనూ ఓటమి నుంచి బయటపడేందుకు పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 24 పరుగులు వెనకబడి ఉంది. ఇన్‌ స్వింగ్‌ స్పెషలిస్ట్‌ జేమ్స్‌ అండర్సన్‌ ధాటికి మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (25), హెన్రీ నికోలస్‌ (18) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ నిదానంగా ఆడుతూ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 295 కే ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బెన్‌ స్టోక్‌ 435-8 వద్ద ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement