Tuesday, May 30, 2023

న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ లో.. అల్లు అర్జున్..స్నేహా

ఫ్రెండ్స్ తో క‌లిసి వేకేష‌న్ లో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంప‌తులు. ఈ సందర్భంగా న్యూ ఇయ‌ర్ సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా జరుపుకున్నారు. 2023 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ తమ వేకేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను నెట్టింట వదలడంతో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తాజాగా బ్యూటీఫుల్ ఫొటోను పోస్ట్ చేసింది స్నేహా.ఈ పిక్ లో అల్లు అర్జున్ – స్నేహా రొమాంటిక్ లుక్ ను సొంతం చేసుకున్నారు.

- Advertisement -
   

సముద్ర తీరాన సూర్యుడు అస్తమించే సమయంలో ఆహాల్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇద్దరూ అదిరిపోయే లుక్ లో అభిమానులను ఖుషీ చేశారు. ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ వైట్ కలర్ టీషర్ట్, షార్ట్ లో కనిపించాడు. స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ పార్టీని ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఫన్ మూమెంట్స్ తో కూడిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement