Friday, April 26, 2024

రికార్డు బ్రేక్ చేసిన “వందేభార‌త్”.. 52 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగం

సెమీ హై స్పీడ్ రైలు వందేభార‌త్ నిన్న (శుక్ర‌వారం) అహ్మ‌దాబాద్- ముంబై మ‌ధ్య జ‌రిగిన ట్ర‌య‌ల్ ర‌న్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. దీంతో పాటు కొత్త రికార్డుల‌ను కూడా సృష్టించింది ఈ రైలు. ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ 52 సెకన్లలో గంటకు 100కి.మీ వేగాన్ని అందుకుంది. అయితే.. ఒక బుల్లెట్ ట్రైన్ 100 కి.మీ. వేగానికి చేరుకోవ‌డానికి తీసుకున్న స‌మ‌యం 55 సెకన్లుగా ఉంది. కాగా, దాంతో పోలిస్తే వందేభార‌త్ 52 సెకన్లలో 0-100 కి.మీ. వేగానికి చేరుకుంది. అయితే మొదటి తరం వందేభారత్ రైళ్లు 54.6 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని చేరుకుంటాయని, దీనికి రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని భారతీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

వందే భారత్ ఫీచర్లు..

కొత్త వందేభారత్ రైళ్లలో WI-FI, 32-అంగుళాల LCD టీవీలు, డస్ట్-ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్‌తో కూడిన ఇంధన, సమర్థవంతమైన ACలు, అన్ని తరగతులకు సైడ్ రిక్లైనర్ సీటు సదుపాయాలు ఉంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గతంలో కేవలం ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు మాత్రమే ఈ ఫెసిలిటీస్​ ఉండేవి. ఇక.. మెరుగైన ఫీచర్లలో ఆటోమేటిక్ ఫైర్ సెన్సార్‌లు, CCTV కెమెరాలు, మూడు గంటల బ్యాటరీ బ్యాకప్, GPS సిస్టమ్‌లు, సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా, వైరస్‌లు లేని స్వచ్ఛమైన గాలి, శుభ్రం చేయడానికి ఫొటోకాటలిటిక్ అతినీలలోహిత గాలి శుద్దీకరణ వ్యవస్థలు కూడా ఉన్నాయి.

వందే భారత్ దేశంలోనే మొదటి హైస్పీడ్ రైలు కావడం గమనార్హం. కొత్తగా తయారైన ఈ రైళ్ల పరీక్ష వేగం గంటకు 180 కి.మీ కాగా, గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. ప్రస్తుతం, రెండు రైళ్లు న్యూఢిల్లీ-వారణాసి మరియు న్యూఢిల్లీ-వైష్ణోదేవి కత్రా మధ్య నడుస్తున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement