Friday, April 26, 2024

మరింత రేంజ్‌తో కొత్త టాటా టిగోర్‌..

విద్యుత్‌ కార్ల అమ్మకాల్లో అగ్రభాగాన ఉన్న టాటా మోటార్స్‌ మరింత రేంజ్‌, అదనపు ఫీచర్లను జోడించిన కొత్త టిగోర్‌ ఈవీని మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త టిగోర్‌ ఎక్స్‌ఇ ధరను 12.49 లక్షలుగా, ఎక్స్‌టీ వెర్షన్‌ ధర 12,99,000గా, ఎక్స్‌జడ్‌ ప్లస్‌ వెర్షన్‌ జదర 13,49,000 గా, ఎక్స్‌జడ్‌ ప్లస్‌ ఎల్‌ యూఎక్స్‌ వెర్షన్‌ ధరను 13,57,000గా కంపెనీ నిర్ణయించింది.
కొత్త టిగోర్‌ ఈవీ సిడాన్‌ కారు ఒక సారి ఛార్జింగ్‌ చేస్తే 315 కిలోమీటర్లు వస్తుందని టాటా మోటార్స్‌ పేర్కొంది. ఈ కారు 55కేడబ్ల్యూ పవర్‌ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. పీక్‌ టార్క్‌ 170 ఎన్‌ఎంగా ఉంది.

కొత్త టిగోర్‌ ఈవీలో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ జడ్‌ కనెక్ట్‌, స్మార్ట్‌ వాచ్‌ కనెక్టివిటీ, ఆటో హెచ్‌ల్యాంప్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు, టైర్‌ పంక్చర్‌ రిపేర్‌ కిట్‌ వంటివి ఇస్తున్నారు. ఈ కారుపై కంపెనీ 8 సంవత్సరాలు, లేదా లక్షా 60వేల కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది.

ఇంతకు ముందు టాటా కంపెనీ టిగోర్‌: ఈవీని మూడు వేరియంట్లలో ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విడుదల చేసింది. వీటి ధరలను 11.99-13.14 లక్షల మధ్య నిర్ణయించింది. లాంచ్‌ చేసిన నెలరోజుల్లోనే 20 వేల బుకింగ్స్‌ వచ్చాయి. పాత టిగోర్‌ ఈవీ వినియోగదారులకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా కొన్ని ముఖ్యమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వస్తామని కంపెనీ పాసింజర్‌ వాహన విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ చంద్ర తెలిపారు.

- Advertisement -

దేశంలో ఈవీ కార్లకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. టాటా మోటార్స్‌ గత నెలలోనే 50 వేల ఈవీ కారును మార్కెట్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం టాటా మోటార్స్‌ ఈవీ కార్ల మార్కెట్‌లో 89 శాతం వాటా కలిగి ఉంది. టాటా ఈవీ కార్లను 6 లక్షల కిలోమీటర్ల దూరం పరీక్షించినట్లు ఆయన తెలిపారు. ఇండియన్‌ రోడ్స్‌లో మైలేజీ తెలుసుకునేందుకు తమకు ఇది ఉపయోగపడిందనని శైలేష్‌ చంద్ర తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement