Wednesday, November 6, 2024

New Services – విశాఖ టూ విజయవాడ – అందుబాటులో మరో రెండు విమానాలు

అందుబాటులోకి ఇండిగో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లు
ప్రారంభించ‌నున్న కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

ఆంధ్రప్రభ స్మార్ట్, విశాఖ పట్టణం : విశాఖపట్నం నుంచి విజయవాడకు మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ఈ సర్వీసులను నడపనున్నాయి. వీటిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభిస్తారు.

- Advertisement -

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం రాత్రి 7.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుతుంది. అక్కడ విమానం తిరిగి 8.45 గంటలకు బయలుదేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడ వస్తుందని అధికారులు తెలిపారు.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సర్వీస్ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ చేరుతుంది. . తిరిగి రాత్రి 7.55 గంటలకు బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నం వెళ్తుంది. ఈ సర్వీస్ ల రాకతో విజయవాడ- విశాఖ విమాన సర్వీస్ల సంఖ్య మూడుకు చేరనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement