Thursday, March 28, 2024

రామోజీ ఫిల్మ్ సిటీలో.. పుష్ప‌2 కొత్త షెడ్యూల్

వైజాగ్ లో పుష్ప‌2కి సంబంధించిన ఒక షెడ్యూల్ ని పూర్తి చేశారు మేక‌ర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన సీన్స్ ని షూట్ చేశార‌ట‌.కాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాదులోనే మొదలుకానుందని సమాచారం. హైదరాబాదులోని ‘రామోజీ ఫిల్మ్ సిటీ’లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక భారీ సెట్ వేశారట. మేజర్ పార్టు షూటింగ్ ఇక్కడ కొనసాగుతుందని అంటున్నారు. చాలా కీలకమైన సన్నివేశాలను ఈ సెట్లో ప్లాన్ చేశారని చెబుతున్నారు. రష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. మైత్రీవారు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సృష్టించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీకావు.మ‌రి పుష్ప‌2 ఏ మేర‌కు విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement