Saturday, March 16, 2024

చారిత్రిక నగరాల్లో నూతన జలాశయం.. రాష్ట్ర సాగునీటి రంగంలో మరో ప్రాజెక్టు

  • 2653 కోట్లతో సంగమేశ్వర ఎత్తిపోతల ఫథకం
  • రెండేళ్లలో పనులు పూర్తి… 2.19 ఎకరాలకు సాగునీరు
  • 231 గ్రామాల ఎగువప్రాంతానికి ఎత్తిపోతలు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: సాగునీటి రంగంలో మరో చారిత్రిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆరుదశాబ్దాల వివక్ష అనంతరం ఆవిర్భవించిన తెలంగాణ రా,్టం 35 లక్షల ఎకరాల సాగువిస్తీర్ణం నుంచి కోటీ 125 లక్షల మాగాణీవైపు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ సాధన ఉద్యమాన్ని రగిలించి గమ్యానికి చేర్చిన సీఎం కేసీఆర్‌ సమైక్యపాలకులు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి వివాదాల ముసురుల్లోకి నెట్టిన ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించి నిర్మాణాలు చెపట్టడంతో పాటుగా కొత్త గా సాగునీటిని ఎత్తిపోసే పథకాలకు రూపకల్పనచేశారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగంగా చారిత్రాత్మక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వంసంగేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించింది.

తరాలచరిత్రకు శిథిల సాక్ష్యంగా నిలిచిన సంగారెడ్డిలో సింగూరు ప్రాజెక్టు కు అనుబంధంగా సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపి పనులు ప్రారంభించింది. శాతవాహనల కాలం నుంచి కాకతీయుల వరకు అనేక చారిత్రక నగరాలు, నీటిపారుదల వ్యవస్థ, ఆలయాలు, గోపురాలు ఉన్న సంగారెడ్డిలొ రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. సింగూరు జలాశయ నిర్మాణం లో జరిపిన తవ్వకాల్లో లభించిన సుమారు 100 శాతవాహన శిల్పాలు ఇక్కడే కొలువుతీరి ఉనాయి. అలాగే కాకతీయుల కాలం నాటి ఆలయాలు,శిల్పాలు ఉన్నాయి.

శాతవాహన ఏలుబడిలోని ప్రాచీన సంపద ఈ జలాశయం సమీపంలోనే ఉండటంతో సంగమేశ్వర ఎత్తిపోతల తో పంటపొలాలకు సాగునీరు అందించడంతో పాటుగా గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సంగారెడ్డి శాతవాహనుల కాలంలో గొప్ప చారిత్రిక ప్రదేశం. పటాన్‌చెరు లో ఇప్పటికీ శాతవాహనుల స్థావరాలు, జైన శిల్పాలు, చారిత్రిక నగరాల శిథిల పునాదులు కనిపించడంతో పాటుగా చాళుక్యులు, కాకతీయుల పాలనలోని చారిత్రిక సంపద ఆధారాలు లభ్య మవుతుంటాయి.

- Advertisement -

సంగమేశ్వర ఎత్తిపోతల పథకం రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాజహీరాబాద్‌ మండలంలో నిర్మించబడుతున్న నీటిపారుదల పథకం. సింగూరుజలాశయం కుడివైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సంగారెడ్డి.జహీరాబాద్‌, ఆందోళ్‌ నియోజక వర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నూతన ప్రాజెక్టు నిర్మాణాన్ని తలపెట్టారు.

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 11 మండలాల్లోని 231 గ్రామాల ఎగువప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందనుంది. సింగూరు రిజర్వాయర్‌ తీరం నుంచి 12 టీఎంసీ ల నీటినిఎత్తిపోయడం తో 2.19 లక్షల ఎకరాలు ఆయక్టటును ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రతిపాదించి నీటి పారుదల శాఖకు పనులు అప్పగించింది.

సంగమేశ్వర ఎత్తిపోతల సాగునీటి పనులకోసం రూ. 2653.00 కోట్ల మొత్తానిక జీఓ.ఎం ఎస్‌ 36 ద్వారా ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం భూసేకరణ స్థాయిలో పనులు జరుగతున్నాయి. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సాగునీటితో పాటుగా అనేక సంవత్సరాలనుంచి నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న జనవాసాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అయితే రెండుసంవత్సరాల్లో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నీరు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement